Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్కు చెందిన బండ ప్రకాశ్ రాజీనామాతో రాజ్యసభ స్థానానికి ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు ఈసీ అండర్ సెక్రటరీ ప్రఫుల్ అవాస్తీ గురువారం షెడ్యూల్ను విడుదల చేశారు. ఆ ప్రకారంగా... ఎన్నికకు ఈనెల 12న షెడ్యూల్ విడుదల చేస్తారు. నామినేషన్లకు ఈనెల 19ని తుది గడువుగా నిర్ణయించారు. 30న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు అధికార పార్టీలోని ఆశావహులు ప్రగతి భవన్కు క్యూ కడుతున్నారు. ఈ రేసులో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు... ముందు వరుసలో ఉన్నారు. టీఆర్ఎస్ తరపున ఎస్సీ సామాజిక వర్గం నుంచి పెద్దల సభలో ఎవరూ లేకపోవటం ఆయనకు కలిసొచ్చే అంశం. మోత్కుపల్లితోపాటు మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ మంత్రి, నిజామాబాద్ నేత మండవ వెంకటేశ్వరరావు, నల్లగొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నర్సింహారెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి దామ మల్లేశ్, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన దామోదరరావు తదితరుల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్... రాజ్యసభకు ఎవరి పేరును ఖరారు చేస్తారనేది వేచి చూడాలి.