Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీడ్‌బ్రేకర్ల ఎత్తు తగ్గింపు
- కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జాతీయ రహదారులపై వికలాంగులు రోడ్డు దాటేందుకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)ను ఇటీవల ఆదేశించింది. సామాన్య పాదాచారుల మాదిరి కాకుండా వికలాంగులు సాఫీగా రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. అయితే, ఇప్పటికే అన్ని ఎన్‌హెచ్‌ల ప్రాంతీయ అధికారులకు ఈ ఆదేశాలు అందగా, రాష్ట్రంలో ఉన్న 25 జాతీయ రహదారులపై కూడా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగమైనట్టు తెలిసింది. అందులో భాగంగా పట్టణ ప్రాంతానికి సమీపంలో ఉన్న జాతీయ రహదారుల్లో కెర్బు ర్యాంపు(స్పీడ్ బ్రేకర్ల మాదిరి ఎత్తుగా కాకుండా కొంచెం తక్కువ ఎత్తులో ఉండే విధంగా... నున్నగా చేయడం), జిబ్రా క్రాసింగ్ కూడా వికలాంగులు నడిస్తే గ్రిప్ ఉండే విధంగా, ఆడిబుల్ సిగల్ క్రాసింగ్(రోడ్డు దాటేప్పుడు వికలాంగులకు సాయంగా చెప్పేందుకు) కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారులు చెప్పారు.