Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హంతకులను కఠినంగా శిక్షించాలి : కెవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత దురహంకార హత్యకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వెస్లీ, టి స్కైలాబ్ బాబు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నాగరాజు అనే దళిత యువకుడు మతాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో అతగి భార్య సోదరులు అత్యంత కిరాతకంగా అతడిని హత్యచేశారని తెలిపారు. నాగరాజు, ఆశ్రీన్ పరస్పరం ఇష్టపడి పెండ్లి చేసుకున్నారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ వారు రెండు దఫాలుగా వికారబాద్ బాలానగర్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారని తెలిపారు. వారికి రక్షణ కల్పించటంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. మతోన్మాద పైశాచిక చర్యతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనను ఆసరా చేసుకుని మతోన్మాద శక్తులు ఘర్షణలు సృష్టించాలని చూడటం సరికాదని పేర్కొన్నారు.