Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతాంతర వివాహం చేసుకున్న నాగరాజును హత్యచేసిన దోషులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మతాంతర వివాహం చేసుకున్న ఆశ్రీన్ సుల్తానా నాగరాజు దంపతులను వెంటాడి హ్యతచేశారని తెలిపారు. వారిద్దరు ప్రేమ వివాహం చేసుకోవటాన్ని నేరంగా చూశారని పేర్కొన్నారు.దీంతో వారికి ప్రమాదం ఉందని పలు సార్లు పోలీసులకు పిర్యాదు చేసినా స్పందించలేదని తెలిపారు. కులాం తర, మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదని విమర్శించారు.