Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
- రైల్వే పనులు వేగవంతం చేయాలని.. సిద్దిపేటలో సమీక్షా సమావేశంలో ఆదేశం
నవ తెలంగాణ-సిద్దిపేట
సిద్దిపేట ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తూ.. సాగు, తాగు నీరు ఇస్తున్న రంగనాయకసాగర్‌ను రాబోయే రోజుల్లో రూ.100 కోట్లతో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసుకోబోతున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలోని ఒకటోవార్డు లింగారెడ్డిపల్లి, చిన్నకోడూర్ మండలం చందలపూర్లో గురువారం నిర్వహిం చిన మహంకాళి అమ్మవారి ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రంగనాయకసాగర్ వద్ద విదేశాల తరహాలో డెస్టినేషన్స్, హౌటల్స్, వాటర్‌హబ్‌గా అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు.
అనంతరం సిద్దిపేట రైెల్వే పనులు, కొనుగోలు కేంద్రాలపై జిల్లా ఆడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో, అర్బన్ తహసీల్దార్, మార్కెటింగ్ డీఎం లతో గురువారం సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లో సిద్దిపేటకు రైలు రాబోతోం దని, రైల్వే పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
అలాగే, జిల్లా వ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని అధికారు లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వెంటనే టార్పాలిన్ కవర్లతో పాటు ప్యాడిక్లీనర్స్ అందుబాటు లోకి తేవాలని చెప్పారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆరబెట్టాలని సూచించారు.