Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చారిత్రాత్మక జహంగీర్ పీర్, పహడీషరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై శుక్రవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి పనుల కోసం నాలుగెకరాల భూమిని సేకరించటంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న అనీసుల్ గుర్భా, చారిత్రాత్మక మక్కా మసీదులో కొనసాగుతున్న మరమ్మత్తుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.