Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్‌రూరల్
రిమాండ్‌పై మెదక్ సబ్ జైలుకు వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడం మెదక్ జిల్లాలో సంచలనం రేపింది. ఫిట్స్, గుండెపోటు రావడంతోనే సదరు వ్యక్తి మృతి చెందాడని జైలు సూపరింటెండెంట్ చెబుతున్నప్పటికీ.. తన భర్తది ముమ్మాటికీ హత్యేనని మృతుని భార్య ఆరోపిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా కేంద్రంలోని దాయరకు చెందిన నీలం రాములు(42) ఓ మహిళపై కత్తితో దాడికి యత్నించిన కేసులో ఈనెల 2న అరెస్టు కాగా.. అతన్ని రిమాండ్‌పై మెదక్ సబ్ జైలుకు తరలించారు. అయితే ఉన్నట్టుండి శుక్రవారం రాములు మృతి చెందాడు. ఈ మృతిపై జైలు సూపరింటెం డెంట్ సుధాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. 'ఈనెల 2న రాములు రిమాండ్ ఖైదీగా వచ్చాడనీ, అన్ని పరీక్షల తర్వాతనే తీసుకున్నామని తెలిపారు. కాగా శుక్రవారం ఉదయం 5 గంటలకు ఫిట్స్ వచ్చినట్టు సమాచారం అందడంతో వెంటనే ప్రథమ చికిత్స చేయించి ఆస్పత్రికి తరలించామన్నారు. కానీ అప్పటికే గుండెపోటు తో మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారని సూపరింటెండెంట్ తెెలిపారు.కాగా ఇది ముమ్మాటికీ హత్యేనని మృతుని భార్య ఆరోపిస్తున్నది. కావాలనే తన భర్తపై తప్పుడు కేసు బనాయించి.. ఓ పోలీసు ఉన్నతాధికారి చంపేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాము లు సోదరుడికి చెందిన భూమిని ఓ పోలీసు ఉన్నతాధికారి కుటుం బీకులు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. అయితే సోదరుడి భూమి తమ ఇంటి పక్కనే ఉండటంతో వేరే వాళ్ళు ఎలా కొంటారు.. ఎందుకు అమ్ముతారని రాములు అడ్డుపడ్డాడు. ఇది జరిగిన పదిరోజులు తర్వాత ఈనెల 1వ తేదీన సదరు పోలీసు ఉన్నతాధికారి తల్లి సంవత్సరికం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్ర మానికి రాములు హాజరయ్యాడు. అయితే భూమి విషయాన్ని మనుసులో పెట్టుకున్న ఆ పోలీసు ఉన్నతాధికారి.. రాములుకు అధికంగా మద్యం తాగించి ఇష్టారీతిన కొట్టారు. ఆ మరుసటి రోజు కావాలనే ఓ కేసులో రాములను ఇరికించి.. పోలీసు స్టేషన్‌కు తరలించి విపరతీంగా కొట్టారని మృతుని భార్య ఆరోపిస్తున్నది. తన భర్తను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కనీస విచారణ లేకుండానే.. ఓ పోలీసు అధికారి చెప్పాడని వెంటనే కేసు నమోదు చేసి రిమాండ్‌కు ఎలా తరలించారని ప్రశ్నించింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.