Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్పై ట్విటర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత సెటైర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు రావాల్సిన నిధులు, విధులు, అధికారాలు, హక్కుల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గానీ, ఆయన పార్టీకి చెందిన ఎంపీలుగాని పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడారా..? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. వాటి కోసం టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతు న్నప్పుడు మీరు ఎక్కడున్నారంటూ ఆమె నిలదీశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా రాహుల్పై... కవిత సెటైర్లు విసిరారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా, జీఎస్టీ బకాయిల గురించి పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించలేదని విమర్శించారు.