Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టుల పరీక్ష ఫలితాలు వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్‌లో 665 గిరిజన బ్యాక్ లాగ్ పోస్టుల పరీక్షా ఫలితాలను గురువారం యాజమాన్యం విడుదల చేసింది. ఈ మేరకు డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) ఎన్.బలరామ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2017 జులైలో గిరిజన బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశామనీ, వీటికి 60 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 37,935 మంది అర్హులకు కాల్ లెటర్లు జారీ చేశామనీ, 2018 జూన్ 10వ తేదీ నిర్వహించిన పరీక్షలో 27,279మంది హాజరయ్యారని వివరించారు. ఈ నియామకాలపై కొందరు పలు రకాల అభ్యంతరాలతో హైకోర్టులో కేసు వేయడంతో ఫలితాలను నిలిపివేశామన్నారు. తాజాగా న్యాయ పరమైన చిక్కులను పరిష్కరించుకుని, 665 మందితో మెరిట్ జాబితా ప్రకటించామన్నారు. నెలరోజుల్లో వీరందరికీ నియామక ఉత్తర్వులు ఇస్తామన్నారు.