Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్‌పార్టీ మెడలు వంచి త్యాగాల పునాదులపై తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పార్టీ వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్‌గాంధీ చేసిన కామెంట్స్‌పై మంత్రి స్పందించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మితే 2014, 2018లో ఆ ఇక్కడి ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. ఇక్కడ ఇచ్చుడు, తీసుకునుడు లేదనీ, ఎనలేని త్యాగాలతో కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. రైతును రాజును చేయడం కాంగ్రెస్‌పార్టీ వల్ల కాదనీ, ముందు రాహుల్‌ను బీజేపీపై యుద్ధానికి సన్నద్దం కమ్మనమని చెప్పండని ఎద్దేవా చేశారు.