Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'ప్రజాస్వామ్యం మరియు వికేంద్రీకరణ' అనే అంశంపై కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ప్రసంగించనున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు గురుస్వామి సెంటర్, 4వ అంతస్తు, నార్త్‌స్టార్ Aవీ+ ప్లాజా, సెయింట్ జాన్స్ చర్చి ఎదురుగా, వెస్ట్ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎస్ జైపాల్‌రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ దీనిని నిర్వహిస్తుంది. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు శుక్రవారంనాడొక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ జైపాల్‌రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని పేర్కొన్నారు.