Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్ : హైదరాబాద్ కొండాపూర్‌లో ఏర్పాటుచేసిన కె ఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ బ్రౌచర్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ రోజు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ప్రధాన లక్ష్యంతో పని చేస్తోందని అన్నారు. గ్లోబల్ బిజినెస్ స్కూల్ విజయవంతమవ్వాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం కె ఎల్ యూనివర్సిటీ ఉపాకులపతి డాక్టర్ సారధివర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్. శ్రీనివాసరావు, హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు, ప్లే సెమెంట్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ రామకష్ణ తదితరులు మంత్రిని సత్కరించారు.