Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయండి
- యువత వేగుచుక్క పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు పశ్చిమబెంగాల్ లోని కోల్కత్తా సాల్ట్ లేక్‌లో జరిగే డివైఎఫ్ఐ జాతీయ 11వ మహాసభల్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు ఏ విజరుకుమార్ కోరారు. ఈ మేరకు యువత వేగుచుక్క పేరుతో మహాసభ పోస్టర్‌ను డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. డివైఎఫ్ఐ ఏర్పడి 41 ఏండ్లు అయ్యిందని తెలిపారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో భగత్ సింగ్ లాంటి వీరుల ఆశయ వారసత్వంతో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పనిచేస్తున్నదని వివరించారు. యువత ఉగ్రవాదం వైపు మరలకుండా, చైతన్యవంతం చేస్తూ సంఘం శాయశక్తులా కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేశ్ , రాష్ట్ర సహాయ కార్యదర్శులు కష్ణా నాయక్, జావేద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.