Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల్లో అయోమయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తొలిరోజు శుక్రవారం సెకండ్ లాంగ్వేజీ పేపర్-1 పరీక్షను నిర్వహించారు. అయితే సంస్కృతం ప్రశ్నాపత్రంలో పలు ప్రశ్నలు పునరావృతం కావడం గమనార్హం. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఒక బిట్లో ఒక ప్రశ్న, మరో బిట్లో రెండు ప్రశ్నలు మొత్తంగా మూడు ప్రశ్నలు తిరిగి అవే పునరావృతం కావడం విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. 12వ బిట్లోని రెండు, 11వ ప్రశ్నలు, 13వ బిట్లో ఒకటి, 12వ ప్రశ్నలు, అలాగే రెండు, 11వ ప్రశ్నలు పునరావృతమయ్యాయి. తప్పుల్లేకుండా ప్రశ్నాపత్రాలు రూపొందించామంటూ చెప్పిన ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతున్నదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే గతేడాది బోర్డు అధికారులు పరీక్ష పత్రాల మూల్యాంకనంలో చేసిన తప్పిదాల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. అయినా అధికారుల తీరులో మార్పు లేకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల తయారీలో జాగ్రత్తలు పాటించకపోవడం ప్రశ్నలు పునరావృతం కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి ఇలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.