Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ డిక్లరేషన్ ఇదే : రేవంత్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్లో శుక్రవారం జరిగిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ను ప్రకటించారు. తెలంగాణ అంటే తమకు నినాదం, ఎన్నికల స్టంటు కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 365 రోజుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుందనీ, సోనియమ్మ రాజ్యంలో అధికారంలోకి రాగానే రూ.రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో కన్నీళ్ళు, కష్టాలు తప్ప ఏమి లేవన్నారు. ఎవరైనా రావాలి..కేసీఆర్ పాలన అంతం చేయాలంటూ పల్లెల్లో జనాలు రోదిస్తున్నారని అన్నారు. కేసీఆర్ని గద్దె దించడానికి రాహుల్ గాంధీతో కలిసి యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.
డిక్లరేషన్లోని ముఖ్యమైన హామీలివి.
- భూమి ఉన్న రైతులకు ,కౌలు రైతులకు ఏడాదికి 15 వేల రూపాయల పెట్టుబడి సహాయం
- ఉపాధిహామీ కూలీలకు ప్రతి ఏడాది12 వేల సహాయం
- చివరి గింజ వరకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తాం
- చెరుకు పసుపు రైతులను ఆదుకుంటాం
- చెరుకు కర్మాగారాన్ని తెరుస్తాం
- పసుపు బోర్డు ఏర్పాటు
- ఉపాది హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం
- పోడు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
- రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం
- రెవెన్యూ వ్యవస్థ ను ఏర్పాటు చేస్తాం..
- నకిలీ విత్తనాలు, పురుగుమందుల కంపనీలను నియంత్రిస్తాం..
- విత్తన కంపెనీల నుంచి పరిహారం అందిస్తాం..
- నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మిన వారిపై పిడియాక్టులు..
- చివరి ఎకరాకు కూడా నీరందిస్తాం
- నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తాం