Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డిజి.నర్సింహారావు
- మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ
నవ తెలంగాణ - కల్వకుర్తి టౌన్
అంబేద్కర్ హరిజనవాడలో ఇండ్లు లేని వారిని గుర్తించి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని, మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డిజి.నర్సింహారావు డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
ఈ సందర్భంగా డిజి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారని, వాటిని పరిష్కరించడంలో పాలకవర్గం నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్‌ను బట్టి ఆస్తి పన్ను విధించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అర్హులైన వారందరికీ వద్ధాప్య పింఛన్, రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా అంబేద్కర్ హరిజనవాడలో కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలని కోరారు. మున్సిపాలిటీ విలీన గ్రామాల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించి రోజు కూలి రూ.600 చెల్లించాలన్నారు. ప్రస్తుతం పట్టణంలో ఉన్న 50 పడకల ఆస్పత్రి స్థానంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మెన్ సత్యంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్య క్రమంలో నాయకులు ఏపీ మల్లయ్య, పర్వతాలు, అంజనేయులు అనంతరెడ్డి, లక్ష్మణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.