Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇచ్చోడ
కంటైనర్ బోల్తా పడి 10కోడెలు (కంకలు) మృత్యు వాత పడ్డాయి. 8 ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సాద ¸్నెంబర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై జరి గింది. స్థానికులు, పశువైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..58 మూగ జీవాలను పరిమితికి మించి కంటైనర్లో ఎక్కించి నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. సాథ్నెంబర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. జీవాలను వదిలేసి డ్రైవర్, క్లినర్ పరారయ్యారు. పశువులు అరుస్తుండటంతో గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జేసీబీ సాయంతో వాహనం పైభాగం తొలిగించారు. గ్రామస్తుల సహకారంతో పశువులను బయటకు తీశారు.