Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటుకు వెళ్లకుండా చూడాలి : మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జిల్లాలకు చెందిన రోగులను అనవసరంగా హైదరాబాద్‌కు రిఫర్ చేయడాన్ని తగ్గించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై ఆయన నెలవారీ సమీక్ష నిర్వహించారు. రోగులు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా చుడాలని సూచించారు. ఇందుకోసమే జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సేవలు అందుబాటులో ఉంచామనీ, వాటిని ప్రజలకందేలా చూడాలని కోరారు. అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కాటరాక్టు ఆపరేషన్లు చేయాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో మందులుండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, బయటికి రాయవద్దనీ హెచ్చరించారు. తాను జిల్లా ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని తెలిపారు.