Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు నెలల గర్భవతి
- కేసు నమోదు
నవతెలంగాణ-దమ్మపేట
బాలికను బెదిరించి ఓ దుండగుడు పలుమార్లు లైంగిక దాడి చేయడంతో ఏడు నెలల గర్భవతి అయిన ఘటన భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలో వెలుగుజూసింది. ఈ విషయంలో దమ్మపేట ఎస్ఐ శ్రావణ్ కుమార్ శనివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఓ కాలనీకి చెందిన బాణాల సురేష్ ఓ బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బదిరించడంతో బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురవడంతో కుటుంబీకులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. వైద్యులు పరిక్షించి బాధితురాలు ఏడు నెలల గర్భంతో వున్నట్టు తెలిపారు. కుటుంబీకులు ఆమెను గట్టిగా నిలదీయగా.. గర్భానికి కారణం బాణాల సురేష్ అని చెప్పింది. ఈ విషయంపై పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో సురేష్ తప్పును ఒప్పుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో సురేష్, అతని తల్లిదండ్రులు బాణాల ధనలక్ష్మి, వెంకటేశ్వరరావు, మరో బంధువు రాఘవమ్మపై ఎస్ఐ కేసు నమోదు చేశారు.