Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదివారం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం గవర్నర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ జీవితకాలంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ కార్యకర్తలు తమ సేవలందిస్తున్నారనీ,అది ప్రకృతి వైపరీత్యమైనా, మహమ్మారి అయినా సరే మొదట స్పందించే రాయబారులు వారేనని కొనియాడారు. తమ జీవితాలను ప్రమాదంలోకి పడేసుకుంటూ వారందించే నిస్వార్థ్య, మానవీయ సేవలు అపురూపమైనవని అన్నారు. మానవత్వం, నిస్పక్షపాతం, తటస్థత, స్వతంత్రత, స్వచ్చంద సేవ, ఐక్యత, సార్వత్రిక విలువలను రెడ్ క్రాస్ అన్ని సమయాల్లో పాటిస్తున్నదని తెలిపారు. వారందిస్తున్న అత్యుత్తమ సేవా కార్యక్రమాలకుగానూ తన హదయాంతరంగం నుంచి ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. నిర్భయంగా ఇస్తున్న సేవలు సఫలం కావాలని ఆకాంక్షించారు.