Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓ వైపు పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యుల నెత్తిన కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలను సైతం పెంచి మరో పిడుగు వేసింది. ఇంట్లో వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 ధర పెంచింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు తెలిపాయి. హైదరాబాద్‌లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1,052కి చేరింది. మార్చి 22న సిలిండర్‌పై రూ. 50 పెంచారు.
ఆరువారాల వ్యవధిలో 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై రెండోసారి ధరలు పెంచారు. ఈ నెల(మే) ఒకటో తేదీన 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.102.50 పెంచింది. దీంతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రికార్డుస్థాయిలో రూ. 2,562.5కు చేరింది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, కూరగాయల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే ఎల్పీజీ ధరలను పెంచడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2014 మే 26 నాటికి గ్యాస్ సిలిండర్ ధర రూ.410 వుండగా.. అది 8 ఏండ్లకు అంటే మోడీ పరిపాలనా కాలంలో 1052 రూపాయలకు చేరింది.