Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌పై మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ అమరువీరుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమవుతున్నదని పేర్కొన్నారు. బీజేపీని ఎదురుకోవడం చేతగాక చేతులు ముడుచుకుని కూర్చున్నదని విమర్శించారు. దేశంలో నిర్మాణాత్మక ప్రతిపక్షం లేకపోవడంతో బీజేపీది ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని ఆదివారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రాన్ని, బీజేపీని రాహుల్ ఒక్కసారి కూడా ప్రశ్నించలేదన్నారు. బీజేపీ గెలువాలనే తాపత్రయం కమలం కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా ఆరాటపడుతుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యవసాయరంగం పట్ల ఒక విధానం, ప్రణాళిక లేదని విమర్శించారు.