Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోహెడ
వృద్ధాప్యంలో తనను ఆదుకుంటుందనుకున్న కూతురే ఆస్తి కోసం కన్న తండ్రిని హత్య చేసింది. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గుడికందుల పోచయ్య(71)కు ఇద్దరు కూతుళ్లు. భర్తతో విభేదాల కారణంగా చిన్న కుమార్తె లింగాల రాజేశ్వరి తండ్రి దగ్గరే ఉంటోంది. వింజపల్లి గ్రామంలో తన తండ్రి పేరునున్న 30 గుంటల భూమి, ఉంటున్న ఇంటిని తన పేరున రాయించాలని తరచూ తండ్రితో గొడవపడుతోంది. శనివారం రాత్రి పోచయ్య భోజనం చేస్తుండగా ఇల్లు, పొలం తన పేరున చేయించాలని కోరింది. గొడవ పెరగడంతో భోజనం చేస్తున్న ప్లేట్తో తండ్రిని బాదడంతో పాటు మర్మాంగాలపై బలంగా తన్నింది. దాంతో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని సీఐ రఘుపతిరెడ్డి పరిశీలించారు. మృతుని పెద్ద కూతురు గజ్జెల రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపారు.