Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢకొీన్న ట్రాలీ, లారీ
- ఏడుగురు మృతి.. 20 మందికి గాయాలు
- సంతకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఘటన
నవతెలంగాణ-నిజాంసాగర్
లారీ, ట్రాలీ ఆటో ఢకొీన్న ఘటనలో ఆరుగురు మృతిచెందగా, 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన దౌతల్పల్లి మాణిక్యం గత గురువారం మృతిచెందగా.. ఆదివారం ఆయన దశదిన కర్మ నిర్వహించారు. దాంట్లో భాగంగా వారి ఆచారం ప్రకారం.. బాధిత కుటుంబాన్ని.. కుటుంబీకులు, బంధువులు కలిసి సంతకు తీసుకెళ్లి రావాల్సి ఉంటుంది. అలా సుమారు 25 మంది కలిసి ఓ ట్రాలీ వాహనం మాట్లాడుకొని ఎల్లారెడ్డిలో జరిగిన సంతకు వెళ్లారు. తిరిగి వస్తుండగా.. అన్నాసాగర్ తండా వద్ద ధాన్యం లోడుతో వస్తున్న లారీ ట్రాలీ ఢకొీన్నాయి. దాంతో డ్రైవర్ సాయిలు(25), గంగమణి(40), లచ్చవ్వ(45), వీరమణి(38), సాయవ్వ(40), అంజవ్వ(40), ఈరమణి(70) అక్కడికక్కడే మృతిచెందారు. ఒక్క సారిగా వాహనాలు ఢకొీనడంతో ట్రాలీలో ఉన్న వారు ఎగిరిపడ్డారు. ఘటనా స్థలంలో భీతావాహ వాతావరణం నెలకొంది. బలంగా ఢ కొనడంతో ట్రాలీ ముందుభాగం నుజ్జునుజ్జయింది. సాయిలు మృతదేహం క్యాబిన్లోనే ఇరుక్కుపోయింది. 20 మంది గాయపడగా స్థానికుల సాయంతో పోలీసులు వారిని బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.