Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులాంతర, మతాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలి
- నాగరాజు కుటుంబానికి రూ.75లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి:
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి, డిజి.నర్సింహారావు
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలో అనేక కులదురహంకార హత్యలు జరుగుతున్నా పట్టించుకోని బీజేపీ నాగరాజు హత్యపై మాత్రం మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి విమర్శించారు. మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు హత్యను ఖండిస్తూ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గోల్కోండ చౌరస్తాలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు, ఆ కుటుంబాలకు రక్షణ కల్పించేలా చట్టం చేయా లని డిమాండ్ చేశారు. గతంలో పార్లమెంట్లో సీపీఐ(ఎం) ఈ విషయాన్ని లేవనెత్తిందని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు మాట్లాడుతూ.. మంథని మధుకర్ నుంచి మొదలుకుని అంబోజు నరేష్ వరకు అనేక మంది కులదురహంకార హత్యలకు, దాడులకు గురైనా ఏనాడూ మాట్లాడని బీజేపీ.. నేడు నాగరాజు హత్య నేపథ్యంలో మతవైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర సీని యర్ నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అనేక హత్య లు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నాగ రాజు కుటుంబానికి రూ.75లక్షల ఎక్స్‌గ్రేషియా, ఆయన భార్యకు ప్రభు త్వం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యులు కెఎన్.రాజన్న, ఎం.మహేందర్, ఎం.దశరథ్, ఎం.వెంకటేష్, కె.ఈశ్వర్రావు, కె.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.