Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో దూరవిద్య పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈనెల 31 నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పివి శ్రీహరి సోమవారం టైంటేబుల్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షలు ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు వచ్చేనెల 21 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు.