Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్‌లో ఉన్న రూ.3 వేల కోట్ల వసూలుకు ప్రణాళిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న వాణిజ్యపన్నులను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం ద్వారా అవకాశం కల్పించింది. ఇప్పటివరకూ పెండింగ్‌లో ఉన్న రూ.3 వేల కోట్ల పన్నులను రాబట్టేందుకు ఈ చర్యకు పూనుకున్నది. కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కేరళ, బీహార్ రాష్ట్రాల్లో అయా ప్రభుత్వాలు అమలు చేసిన వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో విడుదల చేశారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ పన్నులు బకాయిపడ్డవారికి నాలుగు వాయిదాల పద్ధతిలో వడ్డీ లేకుండా చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వాటిని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీవోలో సూచించింది.