Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా సంఘాలు, ట్రాన్స్జెండర్ జేఏసీ డిమాండ్ : మహిళా కమిషన్ చైర్పర్సన్కు వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల దురహంకార హత్యకు గురైన నాగరాజు భార్య ఆశ్రీన్ సుల్తానాకు రక్షణ కల్పించాలని మహిళా సంఘాలు, ట్రాన్స్జెండర్స్జేఏసీ డిమాండ్ చేశాయి. సోమవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఆశ్రీన్ సుల్తానాకు రక్షణ కల్పించాలని కోరారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇల్లు, భూమి ఇవ్వాలని కోరారు. ఆశ్రీన్కు ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసు పక్కదారి పట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. బాధితులను మహిళా కమిషన్ కలిసి మద్దతు ఇవ్వాలన్నారు.