Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి ఆవేదన
- రక్షణ కోసం భరోసా టీమ్స్
- పని ప్రదేశాల్లో జరుగుతున్న అరాచకాలను సహించం: సోనం మిట్టల్
- చారిటబుల్ ట్రస్ట్ సమావేశంలో వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజం అన్ని రంగాల్లోనూ దినదినాభివృద్ధి చెందుతున్నా.. ఇంకా మహిళలపై దాడులు దౌర్జాన్యాలు జరగటం అత్యంత విచారకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వి. సునితా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారిపై కొనసాగుతున్న అఘాయిత్యాలు, హింస, అరాచ కాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు. వారు ఎదుర్కుం టున్న సమస్యల పరిష్కారానికి మహిళా కమిషన్ కృషి చేస్తున్నదన్నారు. అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని గ్రీన్ పార్క్ హౌటల్లో సోనమ్ మిట్టల్ మహిళ సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొ న్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, బాలి కలకు అవార్డులు, నగదు బహుమతులను అందజేశారు. మహిళా కమిషన్ మహిళలకు రక్షణ, వారి హక్కులపై అవగాహన కల్పించటంతో పాటు అండగా నిలుస్తుందన్నారు. మహిళలు ఏ సమస్య వచ్చినా అధైర్యపడకుండా దృఢంగా ఉండాలని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందనీ, కాకపోతే.. దాన్ని చూసే కోణం రకరకాలుగా ఉంటుందని తెలిపారు. గృహహింస, వరకట్న వేధింపులు, పనిప్రదేశాల్లో దాడులు తదితర అరాచకాలపై మహిళా కమిషన్ చర్యలు తీసుకుం టుందని చెప్పారు. ఆయా జిల్లాల్లోకి కమిషన్ సిబ్బంది పోయి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నదని చెప్పారు. రక్షణ కోసం భరోసా, సఖీ, షీటీమ్స్, వీ-హబ్ ఏర్పాటు తదితర పద్దతుల్లో మహిళలకు కమిషన్ రక్షణగా ఉందని తెలిపారు. సృష్టికి మూలం మహిళ(అమ్మ)నే విష యాన్ని మదర్స్‌డే సందర్భంగా గుర్తుచేసుకోవాలని చెప్పారు. మారుతున్న సమాజంలో తండ్రితో పాటు తల్లికూడా కష్టపడుతున్నదని గుర్తుచేశారు.
ఇంట్లో సమస్యలతో కమిషన్‌కి రాలేకపోయే వారు సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని గుర్తు చేసారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ రజఔువశ్రీaఅస్త్రaఅa ద్వారా, ఈమెయిల్ telanganastatewomenscommission@gmail.com,హెల్ప్ లైన్ 181 లేదా కమిషన్ వాట్సప్ నంబర్ 9490555533 ద్వారా కూడా మహిళలకు జరిగే అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రె టరీ కష్ణ కుమారి, ఎఫ్ఐసీసీఐ చైర్ పర్సన్ శుభ్ర మహేశ్వరి, శివకుమార్ మిట్టల్, రవీందర్ మిట్టల్, కిషన్ అగర్వాల్, అనురుగ్ మిట్టల్ తదితరులు మాట్లాడారు.