Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రియల్ ఎస్టేట్‌కు సర్కారు సన్నద్ధం
- 'కుడా' పరిధిలో 21,517 ఎకరాలు
- ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్
- అహ్మదాబాద్, గాంధీనగర్ తరహాలో పథకం
- వ్యతిరేకిస్తున్న రైతులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో 21,517 ఎకరాల భూములను ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), ల్యాండ్ పూలింగ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద సేకరించి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 'కుడా' ఏప్రిల్ 30వ తేదీన భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. నిత్యం బీజేపీని తిడుతున్న టీఆర్ఎస్.. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వ నమూనానే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం గమనార్హం. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల్లో ల్యాండ్ పూలింగ్తో ఓఆర్ఆర్ నిర్మించడం వల్ల పరిసర ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందినందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు 'కుడా' తెలిపింది. ఇందులో ప్రధానంగా అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనపరుచుకోవడమే లక్ష్యంగా సర్కార్ ఈ నోటిప ˜ికేషన్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ల్యాండ్ పూలిం గ్‌కు వ్యతిరేకంగా రాజ కీయ పార్టీలకతీతంగా రైతు లు చేస్తున్న పోరాటంలో టీఆర్ఎస్ నేతలు కూడా ఉండటం గమనార్హం.
వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో 'కుడా' పరిధిలో ఉన్న పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లోని 11 మండలాలు, 27 గ్రామాల్లోని 21,517 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించడానికి అధికారులు గుర్తించి నోటిఫికేషన్ జారీ చేశారు. వరంగల్, గీసుగొండ, ఐన వోలు, దామెర, వర్ధన్నపేట, కాజీపేట, ధర్మసాగర్, జఫర్‌గఢ్, సంగెం, చిల్పూరు, ఖిలా వరం గల్ మండలాల్లోని దామెర, కొత్తపేట, పైడి పెల్లి, బొల్లికుంట, గాడేపల్లి, వెంకటాపూర్ హవేలి, చెన్నారం, మొగిలిచర్ల, రాం పూర్, వసంతాపూర్, కాపులక నపర్తి, పోతరాజుపల్లి, దూపకుంట, వంచనగిరి, గొర్రెకుంట, ధర్మారం, పంథిని, పున్నేల్, ఐనవోలు, కక్కిరాలపల్లి, గర్మిల్లపల్లి, వెంకటాపూర్(ఐ), కూనేరు, రఘునాధపల్లి, నష్కల్, ధర్మాపూర్, పెద్దపెండ్యాల గ్రామాల్లో భూమిని ప్రతిపాదిస్తూ ఏప్రిల్ 30న కూడా నోటిఫికేషన్ జారీ చేసింది.
నియోజకవర్గస్థాయిల్లో రైతు ఐక్యకార్యాచరణ కమిటీ
వరంగల్ మండలంతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూ రైతు ఐక్య కార్యచరణ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆందోళనలు ప్రారంభించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లోని రాంపూర్, ధర్మాపురం, నష్కల్, వెంకటాపురం, రఘునాధపల్లి, కూనూరు, పెద్దపెండ్యాల గ్రామాల్లో 7 వేల ఎకరాలను 'కుడా' నోటిఫై చేసింది. ఇప్పటికే పలు గ్రామాల్లో రైతులు త్వరలో ఈ 7 గ్రామాల రైతులు నియోజకవర్గస్థాయిలో ఐక్యకార్యచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని ఉద్యమించనున్నట్టు రాంపూర్ గ్రామ రైతు ఐక్య కార్యచరణ కమిటీ చైర్మెన్ దేశినేని హన్మంతరావు 'నవతెలంగాణ'కు తెలిపారు. గురువారం ల్యాండ్ పూలింగ్‌కు మా భూములు ఇవ్వమని లిఖితపూర్వకంగా రైతులందరం తెలియచేయనున్నట్టు స్పష్టం చేశారు. ధర్మాపురం గ్రామంలో 1,350 ఎకరాలను నోటిఫై చేయగా ఇందులో 1000 మంది రైతులు తమ భూములను కోల్పోతున్నారు. రాంపూర్ గ్రామంలో ఇప్పటికే 90 ఎకరాల్లో 'కుడా' పార్క్ నిర్మిస్తామని శిలాఫలకం వేసి 3 ఏండ్లు పూర్తయినా నేటికీ పనులు ప్రారంభించలేదని, అలాంటి 'కుడా' ఎప్పుడు వెంచర్లు వేసి ఎప్పుడు రైతులకు లాభాలిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అసైన్డ్ భూములు లాక్కోవడానికే..
'కుడా' ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద జరుగుతున్న భూసేకరణ ముఖ్య ఉద్దేశం అసైన్డ్ భూములను లాక్కోవడానికేనని తెలుస్తోంది. 21,517 ఎకరాల భూముల్లో అసైన్డ్ భూములు, లావాని పట్టాల కింద ఎంత భూములున్నాయనే విషయంలో ఆయా మండల తహసీల్దార్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. రెండ్రోజుల్లో ఈ లెక్కలు తేలనున్నాయి. అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి ఉండదు కనుక, ఆ భూములను ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఎకరానికి 1,400 చదరపు గజాల ప్లాటును ఇస్తామని, ఆ భూమిని అమ్ముకోవడానికి కూడా అధికారం వస్తుందని అధికారులు రైతులకు నచ్చచెబుతున్నారు.