Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 90 వేల కొలువుల కుంభమేళ
- మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు
- కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి
నవ తెలంగాణ- మహబూబ్నగర్
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కలల్ని నెరవేర్చేందుకు 90 వేల ఉద్యోగులా కుంభమేళ నిర్వహిస్తోందని.. ఐదారు నెలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో శాంతా నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత గ్రూపు కోచింగ్ అభ్యర్థులకు సోమవారం స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ శాంతా నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఐదారు నెలలపాటు నిరుద్యోగులు ఫేస్బుక్, వాట్సప్, సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ అతి వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మున్సిపల్ శాఖ తరపున అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర పాల్గొన్నారు.