Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫ్రాన్స్‌లో జరుగనున్న జిమ్నాసైడ్-2022 కు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిండి అథ్లెటిక్స్ అకాడమీకి చెందిన ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని ఎన్.మాయావ తి 100మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారనీ, షేక్ పేట అథ్లెటిక్స్ అకాడమీలో ఇంటర్ రెండో సంవత్సర ం చదువుతున్న రవికిరణ్ జావెలిన్ త్రో,మొదటి సంవత్సరం విద్యార్థిని కె.ప్రణయ ట్రిపుల్ జంప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 14 నుంచి ఫాన్స్ లోని నార్మండిలో నిర్వహించే అంతర్జాతీయ పాఠశాలల సమాఖ్య, ప్రపంచ పాఠశాలల జిమ్నాసైడ్ -2022 పోటీలు జరగనున్నాయి. ఎస్సీ గురుకులాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆ పోటీలకు ఎంపికకా వటం అభినందనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అలాగే, చింతకుంట వాలీబాల్ అకాడమీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతు న్న లావణ్య కజకిస్థాన్ లో ఈ ఏడాది జూలైలో జరిగే అండర్-20 ఏషియా వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారని గుర్తుచేశారు.