Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ వి. హనుమంతరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్‌గాంధీ ఆదేశం మేరకు ఈనెల 22 నుంచి జూన్ ఐదోవ తేదీ వరకు రైతు డిక్లరేషన్‌పై గ్రామాల్లో అవగాహన కల్పించాలని తాను నిర్ణయించుకున్నట్టు మాజీ ఎంపీ వి హనుమంతరావు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాస్తున్నట్టు తెలిపారు. తనను చూసి ఇతర నాయకులు కూడా గ్రామాల్లో తిరుగుతారని ఆకాంక్షించారు.
ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చింది కాంగ్రెస్సే : కోదండరెడ్డి
దేశంలో భూస్వాములకు 45 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదనే ఉద్దేశంతో ల్యాండ్‌సీలింగ్ చట్టాన్ని తెచ్చింది తమ పార్టీయేనని కిసాన్ కాంగ్రెస్ జాతీయ నేత కోదండరెడ్డి గుర్తు చేశారు. 48 లక్షల ఎకరాల భూమిని సైతం కాంగ్రెస్ పంపిణీ చేసిందన్నారు. పేదలకు పంచిన భూముల్లో సాగు చేసుకుని బతకాలి తప్ప అమ్ముకోడానికి వీలులేదంటూ టీఆర్ఎస్ క్లాజ్ పెట్టిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే దాన్ని ఎత్తివేస్తామనీ, పేదలు అమ్ముకోవడానికి వీలుగా పట్టా హక్కులు కల్పిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అసైన్డ్ భూములు తీసుకుని, గజానికి రూ. 30వేల నుంచి రూ. 40వేలకు అమ్ముతున్నదని విమర్శించారు. ఎకరానికి 200-300 గజాలు ఇస్తున్నట్టు చెప్పడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ అధికారంల ోకివస్తే ధరణి వెబ్‌సైట్‌ను రద్దు చేస్తామని తెలిపారు.
రైతు డిక్లరేషన్‌పై ఇంటింటి ప్రచారం : మధుయాష్కీగౌడ్
వరంగల్ రైతు డిక్లరేషన్ ఇంటింటికి ప్రచారం చేస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ చెప్పారు. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల అధ్యక్షులు మీడియా సమావేశాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, రైతు డిక్లరేషన్‌ను నెల రోజులపాటు ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే, టీఆర్ఎస్ నేతలు మొహంజ మార్కెట్లో గులాబీ పూలు అమ్ముకుని బతికేవాళ్లని చెప్పారు.