Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి రాష్ట్రంలో ఆరా తీస్తున్న ఎన్ఐఏ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధి ంచిన కార్యకలాపాలు సాగుతున్నాయా అనే కోణంలో మరో సారి ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అదిలాబాద్ నుంచి మరి కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఖలిస్తాన్ ఉగ్రవా దుల కదలికలు సాగినట్టుగా ఉన్న కొంత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు సాగిస్తు న్నారు. ఇటీవల హర్యా నాలో పట్టుబడ్డ నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు గతంలో తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా బైంసాలో పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలను భద్రపర్చడానికి వ్యూహ రచన చేశారన్న విషయం తెలిసిందే. అంతేగాక ఇక్కడి నుంచి నాందేడ్ లేదా మంచిర్యాల్ ద్వారా ఢిల్లీ వైపునకు మారణాయుధాలు, పేలుడు పదార్థాలను తీసుకెళ్లడానికి కూడా వ్యూహ రచన సాగినట్టు తెలిసిందే.