Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడు ఈనెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి- అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్ రెడ్డి(25) 2021లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఎస్క్యూరీలో మాస్టర్ డిగ్రీలో చేరాడు. 2022 ఆగస్టులో చదువు పూర్తి కానుంది. చదువుకుంటూనే ఏప్రిల్‌లో చూసమ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. క్రాంతి కిరణ్‌రెడ్డి ఈనెల 7న సాయంత్రం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు ట్రక్కును వేగంగా ఢకొీట్టింది. దీంతో క్రాంతి కిరణ్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని అక్కడే ఉంటున్న అతని అన్న చంద్రకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఈనెల 13న క్రాంతి కిరణ్ రెడ్డి మృతదేహం స్వగ్రామానికి రానున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.