Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో అనుమతుల్లేకుండా నడుస్తున్న నారాయణ, శ్రీచైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల అడ్మిషన్లు ఒక చోట, పరీక్షలు మరో చోట నుంచి రాయిస్తున్నాయని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ర్యాంకులపై పోలీసులు, విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. మరోసారి పూర్తివివరాలతో ఈడీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వేధింపులకు గురిచేశాయని విమర్శించారు. వాటిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.