Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఏపీ సీఐడీ అధికారులు నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణతోపాటు ఇతర సిబ్బందిని అరెస్టు చేయడం ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడడం దారుణమని విమర్శించారు. మాయమాటలతో తల్లిదండ్రులను మభ్యపెడుతూ అత్యంత దారుణంగా విద్యావ్యవస్థను కార్పొరేట్ విద్యాసంస్థలు భ్రష్టుపట్టించాయని తెలిపారు. కాసులపై దృష్టిపెడుతూ విద్యార్థులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ర్యాంకులు,మార్కులు ఇలాంటి అక్రమాల ద్వారా ఎలా సాధిస్తున్నాయో తల్లిదండ్రులు గ్రహించాలని కోరారు. ఇప్పటికైనా బడ్జెట్ పాఠశాలలను గుర్తించాలని సూచించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరించాలనీ, నిజానిజాలు నిగ్గుతేల్చి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.