Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా గురువారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది మే 12న 'ఇంటర్నేషనల్ నర్సెస్ డే'ను ఉత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరి యంలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే ఉత్సవంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో నర్సులందరు పాల్గొనాలని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి అంతర్గత సర్క్యులర్ జారీ చేశారు.