Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరికి తీవ్ర గాయాలు
- కమ్మర్‌పల్లిలో 63వ హైవేపై అర్ధరాత్రి ఘటన
నవతెలంగాణ-కమ్మర్పల్లి
జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఓ వాహనం ఢకొీనగా ముగ్గురు మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్లపల్లి మండల కేంద్రంలో 63వ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసే జాడీ కిష్టయ్య(36), దినసరి కూలీగా పని చేసే రజిత(33) మండల కేంద్రంలోని గొల్లపేట ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు రాఘవి(12), శరణ్య, కుమారుడు శివకుమార్ ఉన్నారు. జాడి కిష్టయ్య సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో బైక్‌పై తన అత్తగారి ఇంటికి వెళ్లేందుకు భార్య ఇద్దరు కూతుళ్లతో కలిసి బయలుదేరాడు. కమ్మర్పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్తుండగా ఓ వాహనం వేగంగా వచ్చి బలంగా ఢ కొట్టడంతో బైక్ పైన ఉన్న నలుగురూ కిందపడిపోయారు. బైక్ నడుపుతున్న కిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందగా, భార్య రజిత జిల్లా కేంద్రంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. పెద్ద కూతురు రాఘవి మోర్తాడ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. చిన్నకూతురు శరణ్య కుడి కాలుకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొడుకును సైతం తీసుకెళ్లేందుకు బైక్‌పై కూర్చోపెట్టుకోగా.. ఇంటి వద్ద తాతతో ఉంటానని అనడంతో.. అక్కడే ఉంచారు. మృతురాలి తమ్ముడు దుర్గం మహేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానిక ఇందిరమ్మ కాలనీలో విషాదం నెలకొంది. మృతులకు మంగళవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య ఒకే చితిపై ముగ్గురి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బైక్‌ను ఢకొీన్న వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేపట్టినట్టు తెలిపారు.