Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ' కథనంపై
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ పత్రికా ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నవతెలంగాణ దినపత్రికలో ఈనెల 10వ తేదీ 'ఆర్టీసీలో పరాకాష్టకు చేరిన వేధింపులు' శీర్షికతో ప్రచురించిన వార్త సరియైనది కాదని టీఎస్ఆర్టీసీ మేనేసింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారంనాడాయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంస్థలోని విధి విధానాలు, లక్ష్యాలకు ఈ వార్త విరుద్ధమైనదని అభిప్రాయపడ్డారు. కేఎంపీఎల్ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన డ్రైవర్ల నుంచి జీతంలో కోత విధించాలని యాజమాన్యం ప్రతిపాదిస్తున్నట్టు పత్రికల్లో వస్తున్న ఆరోపణలు సమంజసంగా కావని తెలిపారు. ఎక్కడా వేధింపుల పర్వం కొనసాగట్లేదని వివరణ ఇచ్చారు. మహిళా కండక్టర్ పరారీకి సంబంధించి విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించి సదరు మహిళా కండక్టర్పై నమోదు చేసిన కేసుపై విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సంక్షేమ బోర్డుల పనితీరును ప్రశ్నిస్తూ రాయడాన్ని కూడా యాజమాన్యం ఖండిస్తున్నదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఫలితాలను తీసుకురావడంలో విఫలం అవుతున్న వారికి డిపో స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తామని వివరణ ఇచ్చారు. సమర్థవంతంగా పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్ సిబ్బందికి తగిన ఇన్సెంటివ్, అవార్డులు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరగుతున్నదనీ తెలిపారు. కొందరు స్వార్థపరులు కావాలనే ఆర్టీసీపై అసత్య ఆరోపణలు చేస్తూ సంస్థకు చెడ్డపేరు తేవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.