Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశ్రిన్‌కు ఉద్యోగం, ఇల్లు, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి :
- ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ డిమాండ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్రంలో కుల దురహంకార హత్యలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్స్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాగరాజు హత్యకు గురయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ప్రొఫెసర్ పద్మజా షా, జేఏసీ నాయకులు కల్పనా, సంధ్య, రుక్మిణి రావు, భాగ్యలక్ష్మి, మల్లు లక్ష్మి తదితరులు మాట్లాడారు.
అభివృద్ధిలో, ఆధునికతలో ముందుకు దూసుకెళ్తున్న కాలంలో కూడా కుల దురహంకార హత్యలు జరగడం విచారకరమని చెప్పారు. నాగరాజు హత్యతో అనాథగా మారిన ఆశ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్బెడ్రూం ఇంటితోపాటు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల దురహంకార హత్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.