Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ శాతం నిర్ణయించడంలో పాటించాల్సిన విధివిధానాల రూపకల్పనలో భాగంగా తెలంగాణ బీసీ కమిషన్ తమిళనాడు బీసీ కమిషన్‌తో చర్చించింది. బుధవారం చెన్నైలో తెలంగాణ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సారథ్యంలో సభ్యులు తమిళనాడు బీసీ కమిషన్ చైర్మెన్ జస్టీస్ ఎమ్.తనికాచలంతో సమావేశమయ్యారు. సత్తనాథన్, అంబాశంకర్, జనార్థనం కమిషన్ నివేదికలపై చర్చించి, మెథడాలజీ, న్యాయపరమైన అంశాలపై సమాలోచనలు జరిపారు. క్షేత్రస్థాయి అధ్యయనంలో అనుభవాలపై సమాచారాన్ని సేకరించారు. దేశంలోనే తొలిసారిగా కులగణన చేపట్టిన స్థానిక బీసీ కమిషన్ అధ్యయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను, నివేదికలను, న్యాయస్థానాల తీర్పుల ప్రతులనూ సేకరించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లోని టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ నేపథ్యంలో ఈ పర్యటన కొనసాగుతున్నది. మూడు రోజుల పాటు సాగనున్న పర్యటనలో భాగంగా ఈ బందం తమిళనాడు బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ జస్టిస్ జనార్థనం, సామాజికవేత్త డాక్టర్ రాధాకృష్ణ, ఆచార్య సుందరం తదితర ప్రముఖులను, న్యాయనిపుణులను కలువనున్నారు. తెలంగాణ నుంచి అధ్యయనం కోసం వెళ్లిన వారిలో బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్.ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిషోర్ గౌడ్ ఉన్నారు.