Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాజా, రెన్యూవల్ ఉపకారవేతనాల కోసం విద్యార్థులు, కాలేజీలు మే 21 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఎంబీబీఎస్ తదితర కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నందున టీఎస్ ఇ-పాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మరోసారి అవకాశమిచ్చినట్టు ఆయన తెలిపారు. నిర్దేశించిన గడువులోపు అర్హులందరూ ధరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేయాలనీ, అన్ని సంక్షేమశాఖలు విస్తృత ప్రచారం చేయాలని కోరారు.