Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులకు రూ.ఐదుకే భోజన కార్యక్రమం గురువారం ప్రారంభం కానున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు దీన్ని ప్రారంభించనుండగా, మిగతా ఆస్పత్రుల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. రూ.ఐదుకే నాణ్యమైన భోజనం అందించేందుకు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 19న అవగాహన ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రోగి సహాయకులకు రూ.5కే ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఒక్కొక్కరికి మూడు పూటలా.. ఉదయం పెరుగన్నం, పులిహౌర, వెజి టబుల్ పలావ్, సాంబర్ రైస్ అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం, పప్పు లేదా సాంబార్, ఒక కూర, పచ్చడి వడ్డిస్తారు. దీని కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.3.22 కోట్లు వెచ్చించనున్నది.