Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
రచయితలు తమ రచనలను, గ్రంథాలను ముద్రించుకునేందుకు ఎప్పటిలాగే తెలుగు విశ్వవిద్యాలయం 2022 సంవత్సరానికి ఆర్థిక సహకారం అందిస్తుందని రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. భాష, సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతి అంశాలుగా సృజనాత్మకత, పరిశోధన, విమర్శ గల గ్రంథాల రచయితలు తమ రచనల ముద్రణకోసం ఆర్థికసాయం కోరుతూ తెలుగు విశ్వవిద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం నుంచి పొందొచ్చని, లేదా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ నుంచి పొందవచ్చునని పేర్కొన్నారు.