Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంపై కోనరావుపేటలో రైతుల ధర్నా
నవతెలంగాణ - కోనరావుపేట
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో రైతులు బుధవారం రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. మండల కేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ధాన్యం మిల్లుకు తరలించడంలో జాప్యం చేయడంతో ధాన్యం రాశులు పేరుకుపోయాయని, దాంతో అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోయారు. కేంద్రంలో సుమారు 2వేల బస్తాలను తూకం వేసి ఐదు రోజులు గడిచినా నిర్వాహకులు ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. బుధవారం ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్మడంతో ఎక్కడ ధాన్యం తడుస్తుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ నరేందర్ అక్కడికి చేరుకుని ధాన్యాన్ని వెంటనే తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.