Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీవో కార్యాలయం ఎదుట కార్యదర్శుల నిరసన
- పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
నవతెలంగాణ-కోదాడరూరల్
మద్యం మత్తులో టీఆర్ఎస్ నాయకుడు నానా బూతులు తిడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం జరిగింది. రూరల్ ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం..
కాపుగల్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణకు టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలేబోయిన పాపారావు ఉపాధిహామీ పనులపై ఫిర్యాదు చేశాడు. అయితే, ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తానని కార్యదర్శి చెప్పారు. అయినా మద్యం మత్తులో ఉన్న పాపారావు కార్యదర్శిని, సిబ్బందిని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వెంకటనారాయణపై దాడి చేశాడు. తనకు జరిగిన అవమానాన్ని కార్యదర్శి గ్రామస్తులకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అనంతరం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు కార్యదర్శులంతా కలిసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దాడి చేసిన పాపారావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ విజయశ్రీకి వినతిపత్రం అందజేశారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాపారావుపై కేసు నమోదు చేశారు.