Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నర్సుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) డిమాండ్ చేసింది. మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ధనుంజరు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. 200 ఏండ్ల క్రితం ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆర్మీ జవాన్లకు రాత్రింబవళ్లు సేవలందించినట్టే కరోనా మహమ్మారి సమయంలో నేటి నర్సులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించారని తెలిపారు. ఈ క్రమంలో అనేక మంది నర్సుల తమ ప్రాణాలను సైతం కోల్పోయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలనీ, ఆ కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ స్టాఫ్ నర్సులకు పీఆర్సీని ప్రారంభ తేదీ నుంచి వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, మెరుగైన సౌకర్యాలు కల్పించాలనీ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన మాత్రమే నియామకాలు చేపట్టాలని కోరారు.