Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో బబ్బూరి శిరీష్ తొలి లైన్‌ఉమెన్‌గా ఉద్యోగం పొందారు. దీనిపై ఆమె కోర్టులో కొట్లాడి మరీ ఉద్యోగాన్ని సాధించారు. కరెంటు స్తంబాలు ఎక్కడం మహిళలకు సాధ్యం కాదనీ, అందువల్ల ఆ ఉద్యోగాన్ని ఇవ్వలేమంటూ అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే తాను పురుషులతో సమానంగా కరెంటు స్తంబాలు ఎక్కగలనని శిరీష నిరూపించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి తదితరులు మంగళవారం ఆమెకు మంత్రుల నివాస సముదాయంలో నియామకపత్రం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా శిరీష సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.