Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరీశ్ రావుకు టీఎన్జీవోల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను ట్రస్ట్ బోర్డు ద్వారా నిర్వహించాలని టీఎన్జీవో కేంద్ర కమిటీ కోరింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఆ కమిటీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ తదితరులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి సానుకూలంగా స్పందించారనీ, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. పీఆర్సీ కమిటీ నివేదికలో ఉద్యోగుల మూల వేతనం నుంచి ఒక శాతం ఇవ్వాలని చెప్పినప్పటికీ, ఉద్యోగులకు అండగా నిలిచిన సీఎంకు తోడ్పాటుగా రెండు శాతం ఇచ్చి సహకరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు. సీఎంకు, హరీశ్ రావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.